దేవతలంతా కలిసి ఈ క్షేత్రాన్ని ఒక్క రాత్రిలో నిర్మించారట..

హిందూ సంప్రదాయం ప్రకారం గంగానదిలో స్నానమాచరిస్తే సకల పాపాలు పోతాయని.. పునీతులు అవుతారని నమ్మకం. అంతటి పవిత్రత గంగమ్మకు ఉంది. అయితే అలాంటి గంగమ్మ సైతం పాపవిమోచనం పొందిన ప్రదేశం ఒకటుందని తెలుసా? ఆ పవిత్ర ప్రదేశం ఎక్కడుంది? ఆ ప్రదేశానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆ ప్రత్యేకత ఏంటంటే.. దేవతలంతా కలిసి ఒక్క రాత్రిలో ఒక ఆలయాన్ని నిర్మించారు. అది సాధారణ ఆలయం కాదు.. అత్యంత మహిమాన్వితమైన ఆలయం.

కృష్ణా జిల్లాలో సాగర సంగమ ప్రదేశం ఒకటుంది. అదే హంసలదీవి. ఇక్కడ శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఇది పాపవిమోచన క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయానికి సంతానం లేని వారు ఎక్కువగా వస్తుంటారు. ఈ వేణుగోపాల స్వామికి మొక్కుకుంటే ఏడాది లోపే సంతానం లభిస్తుందని నమ్మకం. అందుకే ఇక్కడి స్వామివారిని సంతాన వేణుగోపాల స్వామిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం దేవతలు హంసల దీవిలోని సంగమ ప్రాంతం దగ్గర స్నానం చేసి వేణుగోపాల స్వామిని ప్రతిష్టించినట్టుగా తెలుస్తోంది.

Share this post with your friends