కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నాక తన పదవిని తిరిగి పొందిన ఇంద్రుడు..

జొన్నవాడ కామాక్షి తాయి అమ్మవారి మహిమలు ఎన్నో ఉన్నాయి. కోరిన వారి కోరికలు తీర్చే కల్పవల్లిగా కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. ద్వాపర యుగంలో వశపర్వుడనే రాక్షసుడు ఉండేవాడు. అతని కారణంగా దేవలోకంలో ఇంద్రుడు తన పదవిని కోల్పోయాడు. ఆ సమయంలో ఇంద్రుడు జొన్నవాడ క్షేత్రంలోని కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నాడట. అమ్మవారి చల్లని చూపుతో తిరిగి ఇంద్ర పదవిని పొందాడని చెబుతారు. ఇది మాత్రమే కాదు.. అమ్మవారి మహత్స్యాన్ని తెలిపే మరో విషయం కూడా ఉంది.

ఒకానొకసారి అశ్వత్థామకు కుష్ణు వ్యాధి సోకిందట. అప్పుడు జొన్నవాడ కామాక్షమ్మ సన్నిధిలోని పెన్నానదిలో స్నానం చేసి అమ్మవారిని సేవించుకున్నాడట. అనంతరం ఆసక్తికరంగా ఆయనకు కుష్టు వ్యాధి నుంచి విముక్తి లభించిందట. అప్పటి నుంచి భక్తితో అమ్మవారిని ఎవరు సేవించుకున్నా వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. నెల్లూరు జిల్లాలోని జొన్నవాడ కామాక్షి అమ్మవారిని దర్శించుకోవాలనుకునేవారు ముందుగా రైలు, బస్సు మార్గాల్లో నెల్లూరుకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి జొన్నవాడకు బస్సులు, ఆటోలు ఉంటాయి.

Share this post with your friends