చాతుర్మాస వ్రతములో భాగంగా ఏ నెలలో ఈ వ్రతాన్ని ఆచరించాలంటే..

ప్రప్రథమముగా చాతుర్మాస్య వ్రత సంకల్పమును చేసుకొనవలెను. ప్రథమ మాసములో శాక వ్రతమును, ద్వితీయ మాసములో దధి వ్రతమును, తృతీయ మాసములో క్షీర వ్రతమును, నాల్గవ మాసములో ‘ద్విదల, బహుబీజ వ్రతమును ఆచరించాల్సి ఉంటుంది. కర్కాటక సంక్రమణం నుంచి కానీ ఆషాఢ శుక్ల దశమి, ఏకాదశి, పూర్ణిమ తిథి నాడు ప్రారంభించి కార్తీక పౌర్ణమికి సమాప్తి చేయవలెను.

సుప్తే త్వయిజగన్నాథ
జగత్‌సుప్తం భవేదిదం|
విబుద్ధే చ విబుద్ధ్యేత
ప్రసన్నోభవ మేకచ్యుత |
చతురో వార్షికాన్ మాసాన్
దేవ దేవ జగత్పతే |
నిర్విఘ్నం సిద్ధిమాయాతు
ప్రసాదాత్ తవకేశవ |
గృహీతే॑స్మిన్ వ్రతే దేవ
పంచత్వం యదిమేభమే|
తదాభవేత్ సుసంపూర్ణం
ప్రసాదాత్తే జనార్దన||

ఈ విధముగా ప్రార్థించవలెను. పంచగవ్య శుద్ది చేసుకొని, అచమన, ప్రాణాయామ, సంకల్పంతో శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర రూపాణాం ప్రీతిం కామయమానః చాతుర్మాస్య వ్రతాంగ శాకవ్రత, దధివ్రత, క్షీరవ్రత ద్విదళ వ్రతాఖ్య చతుర్విధ వ్రతం స్వీకరిష్యే.

శాకవ్రత సంకల్పము

(ఆషాఢ శుక్ల ద్వాదశీ- పూర్ణిమ):

శాకవ్రతం మయాదేవ
గృహీతం పురతస్తవ।
నిర్విఘ్నం సిద్ధి మాయాతు
ప్రసాదాత్ తే రమాపతే ॥

శాక సమర్పణ:-

ఉపాయనమిదం దేవ
వ్రత సంపూర్తి హేతవే ।
శాకంతు ద్విజవర్యాయ
స హిరణ్యం దదామ్యహం॥

దధివ్రత సంకల్పము :
(శ్రావణ శుక్ల ద్వాదశీ-పూర్ణిమ)

దధిభాద్రపదే మాసి
వర్ణయిష్యే సదాహరే ||
ఇమంకరిష్యే నియమం
నిర్విఘ్నం కురు కేశవ ॥

దధివ్రత సమర్పణము:-

ఉపాయనమిదం దేవ
వ్రత సంపూర్తి హేతవే !
ద్విజవర్యాయ దాస్యేంహం
స హిరణ్యం ఘనం దధి ॥

క్షీర వ్రత సంకల్పం
(భాద్రపద శుక్ల ద్వాదశీ-పూర్ణిమ) :
క్షీరవ్రతమిదం దేవ
గృహీతం పురతస్తవ |
నిర్విఘ్నం సిద్ధిమాయాతు
ప్రసాదాత్ తే రమాపతే ॥

క్షీరవ్రత సమర్పణ :-

ఉపాయనమిదం దేవ
వ్రత సంపూర్తి హేతవే |
క్షీరంతు ద్విజవర్యాయ
స హిరణ్యం దదామ్యహం ॥

ద్విదళవ్రత సంకల్పము:-
(ఆశ్వయుజ శుక్ల ద్వాదశీ) :
కార్తికే ద్విదలంధాన్యం
వర్ణయిష్యే సదాహరే ||
ఇమంకరిష్యే నియమం
నిర్విఘ్నం కురు కేశవ ॥

ద్విదళ సమర్పణ :-

ఉపాయనమిదం దేవ
వ్రత సంపూర్తి హేతవే |
ద్విదలం ద్విజవరాయ
స హిరణ్యం దదామ్యహం ॥

చాతుర్మాస్యవ్రత సమర్పణ

ఇదం వ్రతం మయాదేవకృతం
ప్రీత్యై తవప్రభో |
న్యూనం సంపూర్ణతాం యాతు
త్వత్ప్రసాదాత్ జనార్ధన ॥

Share this post with your friends