హిందువులు జరుపుకునే పండగలలో మకర సంక్రాంతి అతి పెద్ద పండగ. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే రోజుని మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. అంతేకాకుండా ఈ రోజు నుంచి ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. అలాంటిది దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో ఒకేలా ఎలా జరుపుకుంటారు? అలాగే కొన్ని రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పేరు కూడా మారిపోతుంది. ఒకొక్క రాష్ట్రంలో ఒక్క సాంప్రదాయ పద్దతిలో జరుపుకుంటారు. ఈ క్రమంలోనే తమిళనాడులో మకర సంక్రాంతిని ఏ రూపంలో జరుపుకుంటారో తెలుసుకుందాం.
తమిళనాడులో పండుగ తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే కాస్త విభిన్నంగా ఉంటుంది. ముందుగానే చెప్పుకున్నాం.. కొన్ని చోట్ల పేరు కూడా మారిపోతుందని. ఈ క్రమంలోనే తమిళనాడులో మకర సంక్రాంతిని పొంగల్‌గా పిలుస్తారు. ఈ పొంగల్ పండుగ మన దగ్గరైతే మూడు రోజుల పాటు జరుపుకుంటాం. తమిళనాడులో ఏకంగా నాలుగు రోజుల పాటు నిర్వహించుకుంటారు. ఈ పండుగలో రైతులు తమ ఎద్దులను అలంకరించి గోమాతను పూజించుకుంటారు. అలాగే వ్యవసాయానికి సంబంధించిన ఇతర వస్తువులను సైతం పొంగల్ రోజున పూజిస్తారు. మొత్తానికి ఈ పండుగ అక్కడ రైతుల పండుగ. ఇది రైతుల శ్రేయస్సుకు చిహ్నం.