క్రోధినామ సంవత్సరంలో వివాహ ముహూర్తాలు


సాధారణంగా వివాహ ముహూర్తాలను వధూవరుల వ్యక్తిగత నక్షత్రాల ఆధారంగా నిర్ణయించుకోవాలి. ఇద్దరికీ తారాబలం, చంద్రబలం కుదరాలి. ఇక గృహారంభం లేదా గృహప్రవేశానికి, వ్యాపారానికి యజమాని నక్షత్రాన్ని బట్టి ముహూర్త నిర్ణయం చేసుకోవాలి. అలాగే ముహూర్తం చోర, అగ్ని భయాదులు లేకుండా పంచకరహితం చేయాలి. ఇక్కడ ఇచ్చిన ముహూర్తాలన్నీ పంచాంగకర్తలు పంచకరహితం చేసి నిర్ణయించినవే. కానీ ముహూర్తనిర్ణయానికి అదొక్కటే సరిపోదు. ఇతర అంశాలు కూడా కలిసిరావాలి. దానికి అనుభవజ్ఞులైన పండితుల సహకారం తీసుకోవాలి. ఈ క్రింద ఇవ్వబడిన తేదీలు అవగాహన కోసం మాత్రమే.

1. చైత్రమాసం (ఏప్రిల్ 09 – మే 08) – 18, 19, 20, 21, 26 (ఏప్రిల్ లో వివాహ ముహూర్తాలు కలిగిన ఆంగ్లతేదీలు)
2. వైశాఖమాసం (మే 09 – జూన్ 06) – మూఢం, వాస్తుకర్తరి కారణంగా ముహూర్తాలు లేవు.
3. జ్యేష్ఠమాసం (జూన్ 07 – జూలై 05) – మూఢం కారణంగా ముహూర్తాలు లేవు.
4. ఆషాఢమాసం (జూలై 06 – ఆగస్టు 04) – ఆషాఢమాసాన్ని శూన్యమాసం అంటారు. ముహూర్తాలు ఉండవు.
5. శ్రావణమాసం (ఆగస్టు 05 – సెప్టెంబర్ 02) – 7, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23 (ఆగస్టు లో వివాహ ముహూర్తాలు కలిగిన ఆంగ్లతేదీలు)
6. భాద్రపదమాసం (సెప్టెంబర్ 03 – అక్టోబర్ 02) – భాద్రపదమాసంలో ముహూర్తాలు ఉండవు.
7. ఆశ్వయుజమాసం (అక్టోబర్ 03 – నవంబర్ 01) – 13, 14, 16, 17, 21, 26 (అక్టోబర్ లో వివాహ ముహూర్తాలు కలిగిన ఆంగ్లతేదీలు)
8. కార్తికమాసం (నవంబర్ 02 – డిసెంబర్ 01) – 3, 8, 10, 10, 13, 17, 22 (నవంబర్ లో వివాహ ముహూర్తాలు కలిగిన ఆంగ్లతేదీలు)
9. మార్గశిరమాసం (డిసెంబర్ 02 – డిసెంబర్ 30) – 4, 5, 6, 7, 11, 14, 20, 25 (డిసెంబర్ లో వివాహ ముహూర్తాలు కలిగిన ఆంగ్లతేదీలు)
10. పుష్యమాసం (డిసెంబర్ 31 – జనవరి 29) – పుష్యమాసాన్ని శూన్యమాసం అంటారు. శుభముహూర్తాలు ఉండవు.
11. మాఘమాసం (జనవరి 30 – ఫిబ్రవరి 27) – జనవరి 31, ఫిబ్రవరి 2, 3, 7, 8, 12, 13, 14, 15, 16, 18, 22, 23 (వివాహ ముహూర్తాలు కలిగిన ఆంగ్లతేదీలు)
12. ఫాల్గుణమాసం (ఫిబ్రవరి 28 – మార్చి 29) – 1, 2, 3, 6 (మార్చి లో వివాహ ముహూర్తాలు కలిగిన ఆంగ్లతేదీలు)

గమనిక :-
శుక్ర మౌఢ్యమి : ఏప్రిల్ 28 నుండి జూలై 11 వరకు.
గురు మౌఢ్యమి : మే 3 నుండి జూన్ 3 వరకు.
వాస్తు కర్తరి : మే 05 నుండి మే 28 వరకు.
అన్నప్రాసన వంటి చిన్నపాటి శుభకార్యాలకు ముహూర్తాలు, శూన్యమాసాలతో పని లేదు. మంచిరోజు చూసుకుని నిర్వహించుకోవచ్చు.

Share this post with your friends