మధ్యప్రదేశ్‌లో దసరా నాడు అత్యంత వైభవంగా రావణుడికి పూజలు..

విజయదశమి సందర్భంగా దేశవ్యాప్తంగా రావణ దహనం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అయితే భారత దేశంలోని కొన్ని ప్రదేశాల్లో రావణుడిని కొలుస్తారన్న విషయం తెలిసిందే. రావణుడి అత్తవారిల్లు కూడా భారత్‌లోనే ఉందని చెబుతారు. అక్కడ కూడా రావణుడిని ప్రజలంతా భక్తితో కొలుస్తారు. రావణ దహనం వంటి కార్యక్రమాలు అక్కడ ఉండవు. పైగా శ్రీరామనవమి అనేదే ఉండదు. రావణుడి అత్తవారిల్లు ఉత్తరప్రదేశ్‌లోని మందుర్ (మండూర్) అనే గ్రామంలో ఉంది. మండూర్ వాసులు తమ గ్రామ అల్లుడిగా రావణుడిని గౌరవించుకుంటారు.

ఇక్కడ మాత్రమే కాదు. మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో కూడా దసరా నాడు రావణ దహనం నిర్వహించారు. రావణాసురుడిని పూజిస్తారు. మధ్యప్రదేశ్‌లోని విదిశా గ్రామంలో రావణుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ రావణాసురుడి ఆలయం ఉంటుంది. ఇది ఈనాటిది కాదు.. చాలా ఏళ్ల క్రితం నిర్వించింది. ఇక్కడి వారు తరతరాలుగా రావణాసురుడిని పూజించుకుంటున్నారు. శయన భంగిమలో.. రావణాసురుడి భారీ రాతి విగ్రహం ఈ ఆలయంలో ఉంటుంది. ఇక్కడి రావణుడిని దర్శించుకుంటే తప్పక కోరిన కోరికలు నెరవేరుతాయని అక్కడి వారు చెబుతారు. అందుకే ఆ గ్రామంలోని వారెవరైనా ఏ పని తలపెట్టినా కూడా ఇక్కడి రావణాసురుడికి పూజలు నిర్వహించిన మీదటే మొదలు పెడతారు.

Share this post with your friends