
జొన్నవాడ కామాక్షి తాయి ఆలయానికి ప్రతి శుక్రవారం భక్తులు పోటెత్తుతుంటారు. పెద్ద ఎత్తున భక్తులంతా ఆలయానికి చేరుకుని.. కుంకుమ పూజలు, నిమ్మకాయ దీపాలు వెలిగించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ప్రపంచలోని ఏ ఆలయంలోనూ జరగని పూజ ఒకటి ఇక్కడ జరుగుతుంది. అదే నవావరణ పూజ. ఈ పూజకి ఎంతో శక్తి ఉందని భక్తుల నమ్మకం. అందుకే ఈ పూజ జరిపించుకోవడానికి ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా వస్తుంటారు. ఈ క్షేత్రంలోని మల్లికార్జున స్వామికి జరిపపే సహస్రనామం మరే దేవాలయంలోనూ ఉండదంటే అతిశయోక్తి కాదు.
అదే మల్లిఖార్జున స్వామివారికి నిర్వహించే సహస్రనామం. దీని ప్రత్యేకత ఏంటంటే.. సాక్షాత్తు వేదవ్యాసుడు ఈ దేవాలయంలో పూజారులకు దర్శనమిచ్చి ఉపదేశించాడని చెబుతారు. ఈ సహస్ర నామాల్లో వేద వ్యాసుడు వేదాల సారాన్నంత క్రోడీకరించారని ప్రతీతి. అందుకే ఈ సహస్ర నామ పూజ చేయడం వలన నాలుగు వేదములు పారాయణం చేసినంత ఫలితం లభిస్తుందని చెబుతారు. అందుకే ఈ సహస్ర నామార్చన అనేది కేవలం జొన్నవాడ ఆలయంలోని పూజారులకు మాత్రమే తెలుసని చెబుతారు. వంశపారంపర్యంగా ఈ సహస్రనామ పూజ ఒకరి నుంచి మరొకరికి లభిస్తుందట. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సహస్రనామం రాసి లేదని చెబుతారు.
