
శ్రీ రామ భక్త హనుమాన్‌కు దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలున్నాయి. ప్రతి గ్రామంలోనూ ఆంజనేయుడు తప్పనిసరిగా కొలువుదీరి ఉన్నాడు. అసలు ఆంజనేయస్వామి గుడి లేని ఊరంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇక ఆంజనేయ స్వామి విగ్రహాల్లో అత్యం ముఖ్యమైనది.. పంచముఖ ఆంజనేయ స్వామి. ఈ పంచముఖ ఆంజనేయడు చాలా శక్తివంతుడని పేర్కొంటారు. పంచముఖ హనుమాన్ ఆలయాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. అలాంటి ఆలయమే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెనుమాకలో ఉంది. ఇక్కడ కొలువైన పంచముఖ ఆంజనేయుడి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
పెనుమాక క్షేత్రంలో పంచముఖ ఆంజనేయ స్వామిగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి వెలిశాడు. ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఐదు ముఖాలతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. ఇక్కడి ఆంజనేయుడిని దర్శించుకుంటే శని దోష నివారణ, అభీష్ట సిద్ధి జరుగుతుందనేది భక్తుల నమ్మకం. ఈ క్షేత్రం కోరిన కోరికలు తీర్చే శక్తివంతమైన క్షేత్రంగా పేరుగాంచింది. ముఖ్యంగా శనివారం రోజున ఇక్కడి పంచముఖ ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
పెనుమాకలో కొలువైన హనుమంతుడు అత్యంత శక్తివంతుడని భక్తుల నమ్మకం. అలాగే కష్టాలను తీర్చి వారిని ఎల్లప్పుడూ రక్షిస్తాడని విశ్వాసం.
