హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీరామనవమి పండుగ త్వరలోనే రానుంది. శ్రీరాముడు యావత్ భక్తజనానికి ఆదర్శ పురుషుడు. రాముల వారి కల్యాణాన్ని లోక కల్యాణంగా భావిస్తారు. శ్రీరామనవమి నాడు శ్రీరాముడితో పాటు హనుమంతుడిని పూజిస్తే వ్యక్తి జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష తొమ్మిదవ రోజున శ్రీ రామనవమి పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 6న మనం శ్రీరామనవమిని జరుపుకోనున్నాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున శ్రీరాముడు జన్మించాడని కొందరు.. పట్టాభిషేకం జరిగిందని కొందరు చెబుతారు.
శ్రీ రామ నవమి రోజున కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవడం వలన రామయ్యతో పాటు హనుమంతుడు, లక్ష్మీదేవి ఆశీస్సులు సైతం పొందవచ్చని చెబుతారు. ఆ వస్తువులేంటో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీ రామ నవమికి ముందు పసుపు వస్త్రం లేదా బంగారాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదం. అలాగే శంఖాన్ని ఇంటికి తీసుకొస్తే చాలా మంచిదట. శ్రీరామనవమి నాడు కాషాయ జెండాను కొని తీసుకురావడం శుభప్రదం. శంఖాన్ని పూజ గదిలో పెడితే చాలా మంచిదని చెబుతారు. పూజగదిలో పూజ సమయంలో దీనిని ఊదితే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో నెలకొంటుందని చెబుతారు.