
కార్తీకమాసం శివకేశవులిద్దరికీ ప్రీతి పాత్రమైన మాసం కావడంతో దీనిని పరమ పవిత్రమైన మాసంగా పరిగణిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ మాసం ఆధ్యాత్మిక సాధనతో పాటు మోక్ష సాధనకు సైతం విశిష్టమైనదిగా పేర్కొంటారు. ఈ మాసంలో చేసే ప్రతిదీ చాలా కీలకమైనది. ఈ మాసంలో నదీ స్నానం, దానం, ఉపవాసం, దీపారాధన, దీప దానం వంటి వాటికి అత్యధిక ప్రాధాన్యముంటుంది. ఈ మాసంలో దీపారాధన అయితే చేస్తుంటారు కానీ మన ఇంట్లో చేయాల్సిన ఒక దీపారాధన గురించి చాలా మందికి తెలియదు. అదేంటో తెలుసుకుందాం.
ఈ మాసంలో నిత్యం లేదంటే కార్తీక సోమవారం, పౌర్ణమి రోజున శివాలయాలు, వైష్ణవాలయాలతో పాటు ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే ఈ మాసంలో ధన దీపం వెలిగిస్తే అత్యంత ప్రాధాన్యత ఉంటుందట. ఈ ధన దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇంట ఐశ్వర్యం నెలకొంటుందని పండితులు సూచిస్నతున్నారు. ఈ ధన దీపాన్నే లక్ష్మీ దీపం అని కూడా పిలుస్తారు. ఈ లక్ష్మీదీపాన్ని వెలిగించడం వలన మన ఇంట అష్ట ఐశ్వర్యాలు నెలకొంటాయట.
