అమ్మవారికి 350 కిలోల వెండి రథం.. నిరంతరం సైనికుల పహారాలో నగర్ సేథాని మాత..

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నగర్ సేథాని మాతగా సేవించుకునే దుర్గా దేవి గురించి తెలుసుకున్నా కదా. అమ్మవారికి అలంకరించే ఆయుధాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అమ్మవారి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అమ్మవారినే కాకుండా అమ్మవారి ఆయుధాలు, వాహనం వంటి వాటిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అమ్మవారికి సంబంధించిన కత్తి, గొడుగు, హారతి పళ్లెం వంటివన్నీ వెండితో తయారు చేసినవే ఉంటాయి. చివరకు అమ్మవారి సింహాసనం కూడా బంగారంతో తయారు చేసినదే కావడం విశేషం. పాదరక్షలు వచ్చేసి వెండి.

ఇక అమ్మవారి రథం వచ్చేసి 350 కిలోల వెండితో తయారు చేశారు. దీనిపై అమ్మవారు ప్రతి ఏటా విజయదశమి నాడు నగర పర్యటన చేస్తారు. ఇక అమ్మవారు నిత్యం జవానుల పహారాలోనే ఉంటారు. దీనికి కారణం ఇప్పటి వరకూ చెప్పిందే. అమ్మవారిపై అరకింటాకు పైనే నగలుంటాయి. అలాగే అమ్మవారి పూజకు వినియోగించే ప్రతిదీ వెండి, బంగారంతో తయారు చేసినదే కావడం. ఆభరణాల విలువను దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అమ్మవారి కోసం కట్టుదిట్టమైన భద్రను ఏర్పాటు చేస్తారు. అమ్మవారి నగర పర్యటనను సైతం కట్టుదిట్టమైన భద్రత నడుమే నిర్వహిస్తారు.

Share this post with your friends