టీటీడీకి రూ.16.67లక్షలు విరాళం

విజయవాడకు చెందిన శ్రీ ఎన్.శ్రీరామ్ ప్రసాద్ సోమవారం శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116/- విరాళంగా అందించారు. కాకినాడకు చెందిన ఎలైట్ ఇన్స్ట్రుమెంట్స్ మేనేజింగ్ పార్టనర్ శ్రీ సూర్య నారాయణ రెడ్డి రూ.6,66,000 టీటీడీకి విరాళంగా అందించారు.
ఈ మేరకు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలను టీటీడీ చైర్మన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి పాల్గొన్నారు.

శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నేడు, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. ఉగాదికి ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఇవాళ ఆలయంలో కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం, 30న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ పేర్కొంది. దీంతో 24, 29వ తేదీల్లో ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని ముందుగానే స్పష్టం చేసింది.

Share this post with your friends