మానవ జన్మే ఒక దశావతారంగా పేర్కొంటారు. శ్రీ మహావిష్ణువు లోక కల్యాణార్థం పలు అవతారాలు ఎత్తాడు. అయితే మానవుడి వివిధ దశలను దశావతారాలతో పోల్చుతారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాతృమూర్తి గర్భoలో ఈదుతూ ఎదిగే – “మత్స్యo”. నీటి నుంచి నేల మీదకు ప్రాకే బాల్యం ఒక – “కూర్మo”.
వయసులోని జంతు ప్రవర్తన ఒక – “వరాహo”, మృగం నుంచి మనిషిగా మారే దశ – “నరసిoహo”. మనిషిగా మారినా ఎదగాలని ఎగిరితే నాడు – “వామనుడు’
ఎదిగినా క్రోధo తగదని తెలుసుకుని మసలు కుంటే అతను – “పరశురాముడు”. సత్యo, ధర్మ, శాoతి ప్రేమలతో తానే ఒక సత్పురుషుడిగా మారితే “శ్రీరాముడు”. విశ్వమoతా తానే అని విశ్వసించిన వాడు- “శ్రీకృష్ణుడు”. ధ్యానియై , జ్ఞానియై జన్మ కారణమెరిగినవాడు ఒక – “బలరాముడు”. కర్తవ్య మొనరిoచి జన్మసార్ధకతతో కాగలడు – “కల్కి”. తెలుసుకుంటే కర్మ యొక్క ప్రతి దశలోని అంతరo.. దశావతారo. మలుచుకుంటే ఒక్క జన్మలోనే మనిషి – దశావతారాలు అవుతాయి.