శ్రీవారి ఆలయానికి సంబంధించి నవంబర్ నెల పూర్తి వివరాలు..

తిరుమల శ్రీవారి ఆలయానికి నవంబర్ నెలలో ఎంత మంది భక్తులు సందర్శించుకున్నారు? హుండీ ఆదాయం, లడ్డూ వివరాలు, ఎంత మంది అన్నప్రసాదం స్వీకరించారు? తదితర వివరాలన్నింటినీ తాజాగా టీటీడీ ఈవో జే. శ్యామలరావు వివరించారు. తిరుమల శ్రీవారిని 20.35 లక్షల మంది భక్తులు నవంబర్ నెలలో దర్శించుకున్నారు. హుండీ ఆదాయం వచ్చేసి రూ.111.30 కోట్లు వచ్చింది. నవంబర్ నెలలో శ్రీవారి లడ్డూలు 97.01 లక్షలు విక్రయించడం జరిగింది. నవంబర్ నెలలో 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. 7.31 లక్షల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని.. సన్నిధిలో శ్రీవారి సేవకులు, మహిళా ఉద్యోగులను నియమించాలని ఓ భక్తుడు కోరగా.. భ‌క్తుల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని.. మ‌హిళా ఉద్యోగుల‌ను నియ‌మిస్తామని ఈవో తెలిపారు. తిరుమలలో వృద్ధులు వసతికి సీఆర్ఓకు వెళ్లి ఎక్కువ సమయం నిలబడుక్కోవాల్సి వస్తుందని.. రాంభ‌గీచ‌ బస్టాండ్ దగ్గర కౌంటరు పునః ప్రారంభించాలని ఓ భక్తుడు కోరగా.. ఆఫ్ లైన్‌లో వసతి పొందేలా వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు పరిశీలిస్తామన్నారు.

Share this post with your friends