మైసూర్ దసరా పండుగ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ పండుగ కోసం ఇప్పటికే ఏనుగులను తెప్పించడం జరిగింది. అలాగే పోలీసులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇక్కడి దసరా పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ ఉంటారు. దసరా వేడుకల అధికారిక తేదీని ఇప్పటికే ప్రకటించేశారు. ఇక షెడ్యూల్ కూడా సిద్ధమవుతోంది. ఈ ఏడాది దసరా వేడుకలు అక్టోబర్ 3న ప్రారంభమై.. 12న ముగియనున్నాయి. చాముండి హిల్స్‌లోని చాముండేశ్వరి ఆలయంలో ఈ దసరా ఉత్సవాలను అధికారులు ప్రారంభించనున్నారు. ఉదయం 9.15 గంటల నుంచి 9.45 గంటల వరకు దసరా ఉత్సవాలను ప్రారంభించనున్నారు.
అక్టోబరు 3న నవరాత్రులలో చాముండేశ్వరి అమ్మవారికి తొలిపూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత 9 రోజుల పాటు జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తారు. . అక్టోబరు 12న నవమి నాడు దుర్గాష్టమి, మహానవమి, ఆయుధ, ఏనుగు, అశ్వ పూజలు నిర్వహణతో దసరా మహోత్సవాలు ముగియనున్నాయి. దసరా పండుగ చివరి రోజైన అక్టోబర్ 13న విజయ దశమి పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటల తర్వాత జంబో సవారి 7.30 తర్వాత పంజిన కవాతు నిర్వహిస్తారు. మొత్తానికి దసరా ఉత్సవాల సందర్భంగా మైసూర్ సందడిగా మారనుంది.