పిప్పిలాదుడికి నారదుడు ఆ పేరు ఎందుకు పెట్టారు?

పిప్పలాదుడి గురించి తెలుసుకున్నాం కదా. తల్లిదండ్రులు చితిలో దహనమవడంతో రావిచెట్టు రంధ్రంలో పడిన పండ్లు, ఆకులు తింటూ పెరిగాడు. ఆ తరువాత ఒకరోజు నారదుల వారు అటుగా వెళుతూ రావి చెట్టు రంధ్రంలో ఉన్న పిల్లవాడిని చూశారట. ఆశ్చర్యంతో ఎవరు నువ్వు? అని అడగ్గా.. తానెవరనేది తనకే తెలియదని.. తనకు కూడా తనెవరో తెలుసుకోవాలని ఉందని చెప్పాడట. బాలుని మాటలు విన్న నారదుడు తన దివ్య దృష్టితో బాలుడి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. గొప్ప దాత, దధీచి మహర్షి కొడుకని గ్రహించి బాలుడికి తన తండ్రి జన్మ వృత్తాంతాన్ని వివరించాడు.

నారదుని ద్వారా తన తన తండ్రి దధీచి మహర్షి గురించి బాలుడు తెలుసుకున్నాడు. తన తండ్రి 31 ఏళ్లకే ఎందుకు మరణించాడో తెలుసుకున్నాడు. దధీచి మహర్షికి శనిదేవుని మహాదశ ఉన్నందున అకాల మరణం సంభవించిందని తెలియజేయడంతో తన దురదృష్టానికి కారణమేంటని నారదుడిని బాలుడు అడిగాడు. దానికి కూడా శని దేవుని మహా దశయేనని నారదుడు చెప్పాడు. బాలుడు రావి చెట్టులో ఉంటూ అప్పుడు ఆ బాలుడు ప్రస్తుతం తన దురదృష్టానికి కారణమేమిటని అడుగగా అందుకు కూడా శనిదేవుని మహాదశయే అని నారదుడు చెబుతాడు. బాలుడు రావి చెట్టులో ఉంటూ రావి చెట్టు ఆకులు, పండ్లు తింటూ పెరిగాడు కాబట్టి బాలుడికి నారదుడు పిప్పిలాదుడు అని పేరు పెట్టాడు.

Share this post with your friends