శ్రీకృష్ణుడికి ఎవరు శాపం ఇచ్చారు?

శ్రీకృష్ణుడు పేరు వినగానే మనకు గుర్తు వచ్చేది ద్వారక. ద్వారకను ఆయన ఎంతగానో ప్రేమించాడట. ద్వారకాధీశుడిగా పేరు పొందిన శ్రీకృష్ణుడు ఎందుకు ద్వారక మునిగిపోవడాన్ని అడ్డుకోలేకపోయాడు? అంటే దానికి గాంధారి శాపమే కారణమట. అదేంటో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు స్వయంగా నిర్మించిన ద్వారక ఆయన కళ్ల ముందే నాశనం అవుతుందని, ఆయన వంశస్తులంతా ఒకరిని ఒకరు చంపుకుని వంశమంతా అంతరించి పోతుందని కన్నయ్యకు కౌరవుల తల్లి గాంధారి శాపం పెట్టిందట. కురుక్షేత్ర యుద్దంలో కౌరవులంతా మరణిస్తారు. తరువాత హస్తినాపురంలో యుధిష్టిరుడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఈ పట్టాభిషేకానికి శ్రీకృష్ణుడు కూడా హాజరవుతాడు.

ఆ సమయంలో గాంధారి తన కొడుకులంతా మరణంతో తీవ్ర దు:ఖంలో ఉంటుంది. ఇదంతా సంభవించడానికి శ్రీకృష్ణుడే కారణమని.. ఆయనను నిందిస్తుంది. తన వంశం ఎలాగైతే నాశనం అయిందో అలాగే శ్రీకృష్ణుడి రాజ్యం, వంశం కూడా నాశనమవుతుందని శపిస్తుంది. కన్నయ్య కళ్ల ముందే యాదవ వంశస్తులంతా ఒకరినొకరు చంపుకుంటారని శాపం పెడుతుంది. ఆమె శాప ఫలితంగానే యాదవులంతా కొట్టుకుని మరణించడంతో శ్రీకృష్ణుడి వంశం అంతరించిపోతుంది.. ద్వారక సముద్రంలో మునిగిపోయిందని చెబుతారు. దీని వల్లే గాంధారి శాపం కారణంగానే శ్రీకృష్ణుడు ఏమీ చేయలేకపోయాడని చెబుతారు.

Share this post with your friends