వీటిని నేలపై పెట్టడమో.. కాలితో తాకడమో చేశారో.. లక్ష్మీదేవి దరిదాపుల్లో కూడా ఉండదట..

లక్ష్మీదేవి ఎక్కడుంటే అక్కడ ఎలాంటి ఆర్థిక కష్టనష్టాలు ఉండవట. ఇంతకీ లక్ష్మీదేవి ఎక్కడ కొలువై ఉంటుందంటారా? మన ఇంట్లో చాలా పదార్థాలు అమ్మవారు ఉంటుందట. పసుపు, కుంకుమ, గోవు, గోవు పాలు, తాజా పూలు, దీపం, ధనం, ధాన్యం, బంగారం, వెండి, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ లక్ష్మీదేవి నివాస కేంద్రాలేనట. కాబట్టి వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలట. పొరపాటున కూడా నేల మీద పెట్టడమో.. కాలితో తాకడమో చేయకూడదట. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందట. అసత్యం చెప్పని వారి విషయంలోనూ.. పెద్దలను, గురువులను, తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించే వారికి లక్ష్మీదేవి అనుగ్రహానికి లోటుండదు.

నిస్సహాయులకు చేయూతనిచ్చేవారికి, మూగజీవాల పట్ల దయతో ఉండేవారికి.. దాన ధర్మాలు చేసే వారికి.. ధర్మ మార్గంలో నడిచే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందట. ఇక ఎవరింట లక్ష్మీదేవి ఉండదో తెలుసా? సూర్యోదయం వరకూ నిద్రించే వారి ఇంట లక్ష్మీదేవి ఉండదట. ఇక సంధ్యాసమయంలో నిద్రించడం కూడా దరిద్రానికి సంకేతమట. ఈ సమయంలో నిద్రిస్తే ఇంట దరిద్రం తాండవిస్తుందట. అలాగే నిత్య కలహాలు ఉండే ఇంట.. పని లేకుండా సోమరితనంతో ఉండేవారికి లక్ష్మీ కటాక్షం ఉండదట. ఇక సిరిసంపదలు కావాలంటే పవిత్రతతో పాటు ప్రశాంతంగా ఉండాలట. అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం మెండుగా ఉంటుందట.

Share this post with your friends