గ్రహాలన్నింటిలోకి అత్యంత పవర్ ఫుల్ గ్రహం శని. మనపై శని దేవుడి చూపు పడిందా ఇక కష్టాల కడలిని ఈదాల్సిందే. అయితే మరి శనిదోషం నుంచి ఎలా బయటపడాలి? ఎప్పుడు పూజ చేసుకోవాలి? ఎలా పూజ చేయాలి? వంటివి చూద్దాం. మనిషి చేసే కర్మలను బట్టే శనీశ్వరుడు ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అయితే మనలను శని దోషం వెంటాడుతుంటే మాత్రం ఆయనను ప్రసన్నం చేసుకోవాలట. అప్పుడే కొంత మేర కష్టాలు తగ్గుతాయట. ఇక శనీశ్వరుడికి ఇష్టమైన రోజు శనివారం కాబట్టి ఆ రోజున శనీశ్వరుడిని పూజిస్తే ఫలితం చాలా బాగుంటుంది. మరి ఎలా పూజించాలో తెలుసుకుందాం.
కుంభం, మకరం రాశులను శని గ్రహం పాలిస్తుందని అంటారు. ఈ రాశి వారికి మినహా మిగిలిన రాశుల వారందరిపై శనీశ్వురుడి అనుగ్రహం పెద్దగా ఉండదట. ఇలా శనీశ్వరుడి అనుగ్రహం లేక ఇబ్బంది పడేవారు.. శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి.. నీలం రంగు పువ్వులు, నల్ల ఉసిరి, నల్ల క్లాత్, నల్ల నువ్వులు తీసుకుని శనీశ్వరుడి ఆలయానికి వెళ్లాలి. శనిదేవుని విగ్రహం దగ్గర ఆవనూనెతో దీపం వెలిగించాలి. ఆ తరువాత మన వెంట తీసుకొచ్చినవన్నీ శనీశ్వరుడికి సమర్పించి ఆవనూనెతో అభిషేకం చేయాలి. ఆ తరువాత శని మంత్రాన్ని 108 సార్లు జపించి హారతి ఇవ్వాలి. ఇలా ఐదు వారాల పాటు చేస్తే జీవితంలో అన్ని ఇబ్బందులు తొలగిపోతాయట.