ఏడాదికి నాలుగు సార్లు అమ్మవారిని భక్తితో స్మరిస్తూ నవరాత్రి వేడుకలను జరుపుకుంటాం. అయితే ఈ నవరాత్రుల్లో గుప్త నవరాత్రులు చాలా ప్రత్యేకం. ఈ సమయంలో మనం దుర్గమ్మను పూజించుకుంటాం. గుప్త నవరాత్రులు ముఖ్యంగా తంత్ర విద్యకు ఉపయోగించుకుంటూ ఉంటారు. అసలు ఈ గుప్త నవరాత్రులు ఎప్పుడు? అంటే ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతాయి.అది మరెప్పుడో కాదు.. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో కొన్ని పరిహారాలు చేస్తే చాలా మంచిదని చెబుతారు. గుప్త నవరాత్రులను తొమ్మిది రోజుల పాుట జరుపుకుంటాం.
తొలి రోజున కొన్ని అక్షితలు, గవ్వలను తీసుకుని ఎర్రటి గుడ్డలో కట్టి డబ్బు పెట్టే చోట భద్రపరచాలి. ఆపై అమ్మవారిని 9 రోజుల పాటు పూజించాలి. నవరాత్రులలోచివరి రోజున.. ఆ గవ్వలను ఇంటి ఆవరణలోని నేలలో పాతిపెడితే ఇక మన ఇంట డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని అంటారు. ఈ నవరాత్రులు మొత్తం దుర్గమ్మను తామర పువ్వులతో పూజించాలి. ఇలా చేస్తే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతాం. ఆషాఢ గుప్త నవరాత్రి జూలై 6, 2024 శనివారం ప్రారంభమై జూలై 15, 2024 సోమవారం ముగియనున్నాయి. జూలై 6వ తేదీన గుప్త నవరాత్రి కలశ స్థాపనకు వచ్చేసి ఉదయం 5.11 గంటల నుంచి 7.26 గంటల వరకు శుభ సమయంగా పరిగణించబడుతోంది.