తండ్రిని గొడ్డలితో నరికిన విచారశర్మకు శివపార్వతులు ఇచ్చిన వరం ఏంటంటే..

విచారశర్మ గోవు పాలతో సైకత లింగానికి అభిషేకం చేస్తుండటం తండ్రి చూశాడు. యచ్చదత్తనుడికి విషయం చెప్పాడు. ఆయన కొడుకు కంటే ముందుగానే ఆవులను మేపే దగ్గరికి వెళ్లి చెట్టెక్కి కూర్చొన్నాడు. కొడుకు సైకత లింగాన్ని తయారు చేసి గోవు పాలతో అభిషేకిస్తుండటాన్ని యచ్చదత్తనుడు చూశాడు. వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని కొడుకు దగ్గరకు పరుగెత్తు కుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు. కానీ ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు. అది ఛిన్నాభిన్నమయింది.

అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు తీసుకొచ్చిన గొడ్డలితో సైకత లింగాన్ని తన్నిన తండ్రి రెండు కాళ్లు నరికేశాడు. ‘శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించ వలసిందే’ అన్నాడు. బాగా రక్తస్రావం జరగడంతో తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నాభిన్నమైన సైకత లింగం లోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. లింగాన్ని తన్నాడని తండ్రని కూడా చూడకుండా రెండు కాళ్లూ నరికేశావు. నీవు అడగకున్నా నీకు వరం ఇస్తున్నామని.. ఇవాళ్టి నుండి నీవు మా కుటుంబంలో అయిదవ వాడవు. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. అయిదవ స్థానం చండీశ్వరుడిది. ఇక మీదట నువ్వు చండీశ్వరుడిగా కీర్తించబడతావు అని చెప్పారు.
నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు.

Share this post with your friends