ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవనం సాఫీగా సాగాలంటే ఏం చేయాలి?

జీవితంలో అన్నీ కలిసి రావాలని లేదు. దురదృష్టం వెంటాడితే అరటిపండు తిన్నా పన్ను ఊడుతుంది. సవ్యంగా జరిగితే అదృష్టం. అది లేదంటే.. ఎంత శ్రమించినా ఫలితం శూన్యం. అదృష్టం కలిసి రాలేదని చాలా మంది బాధపడుతుంటారు. దీనికి మనం నిత్యం జీవితంలో చేసే పొరపాట్లు కూడా కారణం కావొచ్చని పండితులు చెబుతారు. మరి చేసిన పని ఏదైనా సక్సెస్ కావాలంటే మనం నిత్యం జీవితంలో కొన్ని నియమాలను పాటించాల్సిందేనట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఇంట్లో పొయ్యిని కర్పూరంతో వెలిగిస్తే చాలా మంచిదట. తద్వారా భగవంతుడి అనుగ్రహం మనకు లభిస్తుందట.

బయట నుంచి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్లు కడుక్కుని మాత్రమే లోపలికి రావాలట. ఇంటి ముందరో లేదంటే సింహద్వారం వద్దనో కాళ్లు కడుక్కున్న తర్వాత మీదటే అడుగు లోపల పెట్టాలట. అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే బంధువులకు నూతన వస్త్రాలను పెట్టి పంపడం ఆనవాయితీ. ఈ సమయంలో అంచు ఉన్న బట్టలను పెడితే చాలా మంచిదట. అలాగే బట్టలు పెట్టడానికి ముందు వాటికి బొట్టు పెట్టి ఇవ్వాలి. సముద్రానికి వెళ్లినప్పుడు సరదాగా చాలా మంది నీటిలో ఆడి.. స్నానమాచరిస్తూ ఉంటారు. అయితే ఏ సమయంలో పడితే ఆ సమయంలో సముద్ర స్నానం చేయకూడదట. అసలు సూర్యాస్తమయం అయ్యిందంటేనే సముద్ర స్నానం జోలికి వెళ్లకూడదట. ఇవన్నీ పాటిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవనం సాఫీగా సాగిపోతుందట.

Share this post with your friends