
పవిత్రమైన శారదీయ నవరాత్రి పండుగ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సారి నవరాత్రులు కాదు.. పది రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇప్పటికే నవరాత్రుల్లో ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు నవరాత్రి సమయంలో దుర్గాదేవికి సంబంధించిన మంత్రాలను జపించాలి. అవేంటో తెలుసుకుందాం. నవరాత్రి సమయంలో తప్పక దుర్గా సప్తశతిని పఠిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందట. ఇది పూజ ఫలితాలను ఇస్తుందని చెబుతారు. నవరాత్రి సమయంలో దానం చేస్తే చాలా మంచి జరుగుతుందని నమ్మకం.
ఇక దానధర్మాల విషయానికి వస్తే.. తమ స్థాయిని బట్టి ఆహారం, బట్టలు లేదంటే డబ్బు దానం చేస్తే మంచిది. నవరాత్రులలో ఏమి చేయకూడదో కూడా తెలుసుకుందాం. నవరాత్రి తొమ్మిది రోజుల పాటు తామస ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. తామస వస్తువులను ఎందుకు తినకూడదంటే.. అవి శరీరంలో మందకోడితనానికి కారణమై పూజకు ఆటంకం కలుగుతుంది. నవరాత్రుల సమయంలో జుట్టు, గోర్లు పంచుకుంటే మంచిది కాదు. అలాగే లెదర్ వస్తువులు వేటిని కూడా ఉపవాస సమయంలో ఉపయోగించకూడదు. మద్యం, స్మోక్ వంటివి చేయకూడదు. స్త్రీ శక్తికి దుర్గాదేవి చిహ్నం కాబట్టి ఈ సమయంలో స్త్రీలను అగౌరపరచవద్దు.
