గాయత్రీ మంత్రాలు ఎన్ని రకాలు?

హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మంత్రం గాయత్రీ మంత్రం. ఇది ఋగ్వేదంలోని 3.62.10 సూక్తంలో ఉంటుంది. ఈ మంత్రం సూర్యదేవునికి (సవితృ) అంకితం చేయబడినది. గాయత్రి మంత్రం అంటే మనకు తెలిసింది మూల గాయత్రీ మంత్రం మాత్రమే. “ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్”. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన, ప్రాథమిక మంత్రం. చతుర్వింశతి గాయత్రి. గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. అవి 24 దేవతా శక్తులను సూచిస్తాయి. ఆ 24 దేవతా శక్తులనే ‘చతుర్వింశతి గాయత్రి’ అంటారు. ఈ 24 దేవతలకు ప్రత్యేక మంత్రాలు ఉన్నాయి.

గాయత్రీ మంత్రాలు ఎన్ని రకాలు?
గాయత్రీ మంత్రాలు ఎన్ని రకాలు?

ప్రధాన గాయత్రి మంత్రంతో పాటు, ఇతర దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక గాయత్రీ మంత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.

విష్ణు గాయత్రి: ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్.
శివ గాయత్రి: ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తయే ధీమహి, తన్నో శివః ప్రచోదయాత్.
శ్రీనివాస/వెంకటేశ్వర గాయత్రి: ఓం నిరంజనాయ విద్మహే నిరాధారాయ ధీమహి, తన్నోవేంకట ప్రచోదయాత్.
గణేశ గాయత్రి: ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్.
కార్తికేయ/షణ్ముఖ గాయత్రి: ఓం తత్ పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి, తన్నోషణ్ముఖ ప్రచోదయాత్.
లక్ష్మీ గాయత్రి: ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి, తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.
అయ్యప్ప గాయత్రి: ఓం భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి, తన్నోశాస్తా ప్రచోదయాత్.

Share this post with your friends