ఆది శేషుడు గురించి వినని హిందువులు ఉండరు. ఆది శేషుడు వేయి పడగలను కలిగి ఉంటాడని చెబుతారు. ఇది విశ్వంలోనే మొదటి పాము అని అంటారు. ఆది శేషుడు తన వేయి పడగలపై గ్రహాలతో సహా సమస్త భూమండల బరువును మోస్తున్నాడు. అలాగే విష్ణుమూర్తికి శయన తల్పంగానూ కనిపిస్తాడు. విష్ణుమూర్తి శయన తల్పంగా ఎలా మారాడో చెప్పేందుకు ఒక కథ ఉంది. అదేంటంటే.. బ్రహ్మ మానస కుమారుడు ప్రజాపతి కశ్యపుడికి ఇద్దరు భార్యలు. వారి పేర్లు కద్రూ, వినతలు. వీరిద్దరి ఓ సారి కశ్యప మహర్షి ఏదైనా వరం కోరుకోమని అడగ్గా.. కద్రుడు తనంత ప్రకాశవంతంగా వెయ్యి పాములకు జన్మ నిచ్చే వరం కోరగా, వినత కేవలం ఇద్దరు బలవంతులైన పుత్రులకు జన్మ నిచ్చే వరాన్ని కోరింది.
కద్రుడు 100 పాములు జన్మించాయి. వాటిలో మొదటిది ఆది శేషుడు. వినతకు ఇద్దరు పక్షులు జన్మించాయి. అయితే కద్రుకి వినత అంటే ఎందుకోకానీ అసూయ. ఒక సారి వినతను ఓ ఆటలో మోసంతో ఓడించి వినతని కద్రు బానిసగా చేసుకుంటుంది. ఇది తెలుసుకున్న శేషుడు చాలా బాధపడి తల్లిని వదిలి గంధమాదన పర్వతంపై తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆదిశేషుడికి తపస్సుకి మెచ్చిన బ్రహ్మ దేవుడు.. ఏం వరం కావాలో కోరుకోమనగా.. విష్ణు మూర్తితో ఉండాలని కోరుతాడు. దీనికి బ్రహ్మ నీవు ఎప్పుడూ విష్ణుమూర్తితోనే ఉంటావని వరం ఇచ్చాడు. అలాగే భూమిని నీ పడగపై మోస్తావని వరం కూడా ఇచ్చాడు. అప్పటి నుంచి శేష నాగుడు భూమిని తన పడగపై మోస్తున్నాడని అంటారు. ఇక బ్రహ్మ వరం ప్రకారమే విష్ణుమూర్తికి ఆది శేషుడు శయన తల్పంగా మారాడట.