బోనాల పండుగలో ఘటం ప్రాధాన్యత ఏంటి?

బోనాల పండుగలో ఘటం తీస్తుంటారు. బోనాల పండుగలో ఇది ఒక ముఖ్యమైన ఘటం. అసలు ఈ సంప్రదాయం ఏంటి? ఎందుకు ఈ సంప్రదాయం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఘటం అంటే ఒక మట్టి కుండ లేదా రాగి పాత్ర. ఈ ఘటాన్ని అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. బోనాల ఉత్సవాల్లో ఈ ఘటాన్ని పూజించి, ఊరేగించడం ప్రధాన భాగంగా పరిగణిస్తారు. ఘటాన్ని స్వయంగా అమ్మవారి స్వరూపంగా భావించి దానిలోకి అమ్మవారిని ఆవాహన చేస్తారు. దీనిని అమ్మవారి శక్తికి, ఉనికికి ప్రతీకగానూ.. పవిత్రతకు, శుభానికి సంకేతంగానూ పరిగణిస్తారు.

ఘటం ఊరేగింపునకు ముందు పసుపు, కుంకుమ, వేప ఆకులు, పెద్ద కన్నులు, బొట్లు పెట్టి అందంగా అలంకరిస్తారు. అమ్మవారి స్వరూపమైన ఘటాన్ని ఊరేగించడం వల్ల గ్రామానికి లేదా ప్రాంతానికి శుభం కలుగుతుందని, ఎలాంటి ఆపదలు రాకుండా అమ్మవారు కాపాడుతుందని భక్తులు నమ్ముతారు. అలాగే ఊరికి అంటు వ్యాధులు వంటివి సోకవని.. కరువు కాటకాలు ఏమైనా ఉన్నా కూడా దూరమవుతాయని చెబుతారు. ఘటం ఊరేగింపుతో ఊరితో పాటు ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని నమ్మకం.

ప్రధాని పూజారి లేదంటే పోతరాజు ఈ ఘటాన్ని తలపై పెట్టుకుని ఊరేగిస్తారు. ఉత్సవం ముగిశాక భక్తిశ్రద్ధలతో దానిని నిమజ్జనం చేస్తారు. దీని అర్థం ఏంటంటే.. అమ్మవారిని ఆమె స్థానానికి తిరిగి పంపించడం.

Share this post with your friends