ద్వారకాపురి అర్జనుడి కళ్ల ముందే మునిగిపోయిందని తెలుసుకున్నాం కదా. ఇది ఎంతవరకూ నిజమని పరిశోధనలు జరిపిన చరిత్రకారులకు ఆసక్తికర విషయాలు తెలిశాయి. క్రీ.పూ.1443లో సాగర గర్భంలో మునిగిపోయిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విషయాలపై చరిత్రకారులు 1983-86లో గుజరాత్ సముద్ర తీరంలో పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. పరిశోధనలు చేసిన చరిత్రకారులు పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను గుర్తించారు.
ఈ పరిశోధనల్లో ద్వారకా నగరం క్రీ.పూ.3150 ఏళ్ల కిందటిదని నిర్ధారించారు. దీనిని ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా దీనిని భావించారు. అయితే ఈ పరిశోధనలో మధ్యలోనే ఆగిపోయాయి. ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటాన్ని అంతా భగవంతుడి మహిమగానే భావిస్తున్నారు.అయితే పరిశోధనల సమయంలో పురావస్తు అధికారులు సముద్ర గర్భం నుంచి వెలికి తీసిన ద్వారక నగరం కట్టడాలను, ద్వారకను చూడటానికి వెళ్లే యాత్రికుల సందర్శనార్ధం అందుబాటులో ఉంచారు.