నందీశ్వరుడి పాదాలు దేనికి సంకేతాలు?

శ్రీశైల ఖండం కావ్యంలో నందీశ్వరుడికి సంబంధించి ఏం లిఖించారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నందీశ్వరుడి పాదాలు దేనికి సంకేతాలో తెలుసుకుందాం. నంది నాలుగు పాదాలు చతుర్వేదాలకు ప్రతీకలుగా చెబుతారు. అయితే నంది కుడి పాదాన్ని గమనిస్తే పైకి లేచి ఉంటుంది. మిగిలిన మూడు పాదాలు లోపలికి మడిచి కనిపిస్తాయి. అయితే కుడిపాదం పైకి లేచి ఉండటానికి ఓ కారణముంది. అదేంటంటే.. కలియుగంలో ధర్మం ఒంటిపాదంపై నడుస్తుందనడానికి దీనిని నిదర్శనంగా చెబుతారు. నందీశ్వరుడి పూజకు అనుకూలమైన సమయం ఒకటి ఉంది.

సంధ్యాసమయాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ప్రదోష కాలంగా చెబుతారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సమయంలోనే నందీశ్వరుడికి అర్చనలు కానీ పూజలు కానీ చేస్తుంటారు. మరి నందీశ్వరుడిని రెండు కొమ్ముల మధ్యలో నుంచి ఎందుకు చూస్తారనే దానికి ఓ కథ ఉంది. సాగర మథనంలో కాలకూట విషాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. దానికి గరళంలో దాచిన మీదట.. ఆ మంటకు శివతాండవం చేశాడట. శివుడి ఉగ్రరూపాన్ని అలా నేరుగా చూసేందుకు దేవతలంతా భయపడి పోయారట. దీంతో నంది వెనుక నిలబడి కొమ్ముల మధ్య నుంచి పరమేపశ్వరుడిని చూశారని పురాణ కథనం. ఈ ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది.

Share this post with your friends