తీర్థయాత్రలకు బయలుదేరే ముందు పఠించవలసిన శ్లోకాలేంటి?

తీర్థయాత్రలకు బయలుదేరే ముందు పఠించాల్సిన శ్లోకాలు కొన్ని ఉన్నాయి. అవి పఠించిన అనంతరం బయలుదేరితే దిగ్విజయంగా యాత పూర్తి చేసుకుని రావొచ్చు. ఆ శ్లోకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1) యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళాం|
తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం!!

2) ఆపదామప హర్తారం ధాతారం సర్వ సంపదాం!
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం!!

3) తదేవలగ్నం సుధినం తధైవ తారాబలం చంద్రబలం తధైవ!
విద్యాబలం దైవబలం తధైవ లక్ష్మీపతే తేఁఘ్రియుగం స్మరామి!!

4) యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పాత్రో ధనుర్ధరః!
తత్ర శ్రీ విజయోర్భూతు ధ్రువానితిర్మతిర్మమ!!

5) సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే! శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే!!

ఈ శ్లోకాలు చదువుకొని తీర్థయాత్రలకు బయలుదేరితే ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా యాత్ర పరిపూర్ణమవుతుంది. ఈ శ్లోకాలను యాత్రలప్పుడు మాత్రమే కాకుండా.. ప్రతి నిత్యం ఉదయం ఇంట్లో నుంచి విద్యా, ఉద్యోగ, వ్యాపారేతర కార్యక్రమాలకు బయలుదేరేటప్పుడు చదువుకొని ఇంటి నుంచి బయలుదేరితే అంతటా జయం కలుగుతుంది.

Share this post with your friends