నెమలి పింఛాన్ని సహజంగానే మనం ఇంట్లో పెట్టుకుంటాం. చిన్నారులైతే పుస్తకాల్లో పెట్టుకుంటారు. అంతేకాకుండా భారతీయ సంప్రదాయంలోనూ నెమలి పింఛానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే ఇంట్లో పెట్టుకునే వారు వాస్తు ప్రకారం పెట్టుకుంటే చాలా మంచిదట. ఐశ్వర్యం సిద్ధిస్తుందట. ప్రాచీన కాలంలో నెమలి పింఛానికి దైవిక గుణాలున్నాయని భావించేవారు. అలాంటి నెమలి పింఛాన్ని ఏ ప్రదేశంలో ఉంచితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.
ఇంట్లో మనం ఎక్కువగా గడిపేది లివింగ్ రూమ్‌లో.. ఇక్కడ నెమలి పింఛాలను ఉంచితే కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మరింత పెరుగుతాయట. ఇంట్లో స్నేహసంబంధాలు మెరుగవుతాయట. ఇక నెమలి ఈకలను బెడ్ రూమ్‌లో ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయట. గార్డెన్ లేదా బాల్కనీలో నెమలి పింఛాలను ఉంచడం వల్ల సహజ సౌందర్యం పెరుగుతుందని నమ్మకం. అలాగే ఇంట్లో పాజిటివిటీ పెంపొంది తద్వారా కుటుంబ సభ్యుల ఎదుగుదలకూ, శ్రేయస్సుకూ దోహదపడుతుంది. అలాగే బీరువాలో లేదా లాకర్‌లో నెమలి పింఛాన్ని పెట్టడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడి సంపద నిల్వ ఉంటుందని నమ్మకం.