అపార్ట్‌మెంట్లలో ఉండేవారు పువ్వుల నిర్మల్యాన్ని ఏం చేయాలంటే..

బయటకు వెళ్లేందుకు వీలుపడనివారు.. పువ్వుల నిర్మల్యాన్ని ఇంట్లోనే ఒక చిన్న పాత్ర లేదా కుండీ పెట్టుకుని, ఎండిపోయిన పూజా పూలను అందులో వేసి కర్పూరంతో లేదా నెయ్యితో కాల్చివేయవచ్చు. ఆ బూడిదను నుదుట బొట్టుగా పెట్టుకోవచ్చు లేదా ఇంట్లోని చిన్న మొక్కల కుండీలలో వేయవచ్చు.

ఫ్లాట్లలో లేదా అపార్ట్‌మెంట్లలో ఉండేవారు ఒక మట్టి కుండీని కేవలం నిర్మల్య విసర్జన కోసమే కేటాయించవచ్చు. అందులో కొద్దిగా మట్టి, పూజా పువ్వులు వేస్తూ ఉంటే, కొద్ది రోజులకు అది పవిత్రమైన “నిర్మల్య ఖాదము”గా మారుతుంది. దీన్ని ఇంట్లోని మొక్కలకే వాడుకోవచ్చు.

అపార్ట్‌మెంట్లలో ఉండేవారు పువ్వుల నిర్మల్యాన్ని ఏం చేయాలంటే..
అపార్ట్‌మెంట్లలో ఉండేవారు పువ్వుల నిర్మల్యాన్ని ఏం చేయాలంటే..

*పూజా పుష్పాలను పడేయకుండా ఒక కవర్ లోనో, గిన్నెలోనో వేసి ఎండబెట్టాలి. అవి బాగా ఎండిన తర్వాత పొడి చేసి, ఇంట్లో ఉండే చిన్న మొక్కల కుండీలలో చల్లితే అవి మట్టిలో కలిసిపోతాయి.
[రోజూ పూజ చేసిన నిర్మల్యం]


[ఒక పాత్రలో వేసి ఎండబెట్టడం]

[మార్గం 1: అగ్ని సంస్కారం]
కర్పూరంతో కాల్చి భస్మం చేయడం
ఆ భస్మాన్ని నుదుట ధరించవచ్చు
[మార్గం 2: మట్టి కుండీ]
మట్టిలో కలిపి ఎరువుగా మార్చడం
(సాధారణ ఇంటి మొక్కలకే వాడుకోవచ్చు)
*భావ శుద్ధిః ప్రధానమ్” – భగవంతుడికి మనం అర్పించిన వస్తువును రోడ్డుపై వేసి అవమానించకుండా, ఇంట్లోనే అగ్ని ద్వారా లేదా మట్టి ద్వారా ప్రకృతిలో లీనం చేయడం వల్ల పూర్తి పుణ్యఫలం దక్కుతుంది.
ప్రస్తుత పుణ్యక్షేత్రాలలో కూడా వ్యవసాయ క్షేత్రాలకు పంపి శుద్ధ ఎరువులుగా మార్చి పంటలు వృద్ధి చెందేలా చూస్తున్నారు ఇది మంచి విధానమే
సాధారణ పట్టణ దేవాలయాల వాళ్ళు ఈ విషయాలు దృష్టి పెట్టాలి , ఆ దగ్గరి ప్రాంతపు దేవాలయాల నిర్మల్యాలను సేకరించి ఒకే క్షేత్రం వైపు పంపి శుద్ధ ఎరువులుగా మార్చడం ముఖ్యం.

Share this post with your friends