శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే..

కౌరవులు శ్రీ కృష్ణుణ్ణి బంధించడానికి వచ్చినపుడు, అర్జునుడు యుద్ధభూమిలో చతికిలపడ్డప్పుడు కృష్ణుడు విశ్వరూపం ప్రదర్శించడం చూశాం. దేవతలు, రాక్షసులు మొదలైన అనేక ముఖాలతో కనిపించే రూపమది. దీని అర్థమేమిటి?

శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే..
శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే..

“పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే!”
సజ్జనులను రక్షించి, దుర్జనులను శిక్షించి ధర్మసంస్థాపన చేయడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే ఉంటానని లోకానికి భరోసా ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.

కురుక్షేత్రంలో మోహరించిన సేనలను చూసి, విచలితుడైన అర్జునుడు ధనుర్బాణాలు విడిచి, చేష్టలుడిగి కూలబడిపోతే, శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ‘గీత’బోధ చేశాడు. మనిషి ఏదో ఒక విషయంపై నిర్ణయం తీసుకోవాలంటే తనకు ఆ విషయంపై తెలిసిన పూర్తి సమాచారాన్ని సమీక్షించి నిర్ణయం తీసుకుంటాడు.

అర్జునుడికి యుద్ధభూమిలో వచ్చిన సందేహం తాను చేస్తున్న యుద్ధం గురించి. యుద్ధానికి సన్నద్ధం కావడానికి ముందు అతడే మిత్రరాజులందరితో మాట్లాడి సైన్యాలు సమకూర్చుకున్నాడు. కృష్ణుడి దగ్గరికి స్వయంగా వెళ్లి సహాయం కోరాడు. అలాంటివాడికి ఒక సందేహం. యుద్ధంలో అనేక మంది వీరులు మరణించాల్సి వస్తుంది.. అదెంత వరకు సమంజసం అని! అతనికి అప్పటికున్న అవగాహనతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక కృష్ణ భగవానుడిని అడిగాడు. బహుశా శ్రీకృష్ణుడు అర్జునుడి నోట అడిగించిన ప్రశ్న ఇది. ఇది అన్ని కాలాల్లో, అన్ని దేశాలకూ అన్వయించే ప్రశ్న.

Share this post with your friends