వరలక్ష్మీ వత్రం రోజున వ్రతం చేసే మహిళ కట్టుకునే చీర కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. అమ్మవారికి ఏ రంగు చీర ఇష్టమో ఆ రంగు చీరను కట్టుకుంటే ఫలితం ఊహించలేని విధంగా ఉంటుందట. లక్ష్మీ దేవిని అష్టశ్వైర్య ప్రదాయినిగా మనం కొలుచుకుంటూ ఉంటాం. ఆదిలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, గజ లక్ష్మిగా, సంతాన లక్ష్మిగా, వీర లక్ష్మిగా, విజయ లక్ష్మిగా, విద్యా లక్ష్మి వంటి ఎనిమిది రూపాల ఏక స్వరూపమే వరలక్ష్మీదేవి. అంటే వరలక్ష్మీ దేవి ఎంత పవర్ ఫుల్ అనేది మనకు తెలుస్తుంది. శ్రావణ మాసంలో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేసి మనస్పూర్తిగా కోరికలు కోరుకుంటే.. నేరవేరతాయని భక్తుల నమ్మకం.
ఇక వరలక్ష్మీ వ్రతాన్ని ఈ నెల 16వ తేదీన శుక్రవారం జరుపుకోనున్నాం. దీనికోసం ఇప్పటికే మహిళలు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ రోజున ఏ రంగు చీర కట్టుకుంటే మరింత మంచి జరుగుతుందో తెలుసా? అమ్మవారికి ముఖ్యంగా బంగారు రంగు అంటే చాలా ఇష్టమట. శ్రీశుక్తంలో మొదటి శ్లోకం ఈ విషయాన్ని చెబుతోంది. కాబట్టి బంగారు రంగు చీర కట్టుకుంటే ఫలితం చాలా బాగుంటుందట. ఈ రంగు లేకుంటే ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్నా కూడా మంచిదేనట. అదీ కాదంటే గులాబీ రంగు చీర కట్టుకుని వ్రతం చేసుకోవాలట. ఈ రంగులలో ఏ రంగు చీరను కట్టుకున్నా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందట.