వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ వ్లాగ్స్.
ప్రపంచంలో హిందువులు ఏ ఖండంలో ఉన్నా చేసుకునే పండుగ “వినాయక చవితి”. మన దేశంలో ప్రజలందరూ కలిసి సామూహికంగా మండపాలు ఏర్పాటు చేసి అత్యంత భక్తి భావంతో చేసుకునే పెద్ద పండుగ వినాయక చవితి. ఎత్తైన, ప్రత్యేకమైన రూపాల్లో గణపతులు ఒకెత్తు అయితే… లడ్డు వేలంపాట మరో ఎత్తు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఈ శోభ పతాక స్థాయిలో ఉంటుంది. ఈ పండుగ మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ లో కొంత ప్రత్యేకత ఉంటుంది. హైదరాబాద్ లో గణపతి మండపం లేని సందు ఉండదు. గణనాధుడు పూజలు అందుకొని అపార్ట్మెంట్ ఉండదు. 11 రోజుల గణేశ ఉత్సవాలు ముగింపుకు వచ్చే సమయానికి ప్రపంచం కళ్ళు అన్ని ఒక గణేష్ మండపం మీదనే ఉంటాయి. అదే బాలాపూర్ గణేశ్.
Watch 200 Year Old Famous Secunderabad Ganesh Temple Vlog
ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా బాలాపూర్ గణేష్ విగ్రహం చూడటానికి చాలా బాగుంది. స్వామి వారు చతుర్భుజాలతో భక్తులను ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుంది. విగ్రహం కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో గొడ్డలి పట్టుకుని ఉన్నారు స్వామి వారు అదే విధంగా కుడి చేతితో భక్తులను అనుగ్రహిస్తున్నట్టు, ఎడుమ చేతిలో లడ్డు ఉంటుంది. ఈ మండపంలో లడ్డు వేలంపాట చాలా ప్రత్యేకం. ఈ లడ్డు ప్రసాదం స్వీకరించిన ఎంతో పుణ్యఫలం అని భక్తుల నమ్మకం. ప్రతీ ఏటా పెరుగుతూ పోతున్న బాలాపూర్ గణేశుని ప్రసాదం వేలంపాట ధర ఈ ఏడాది కూడా కొత్త రికార్డు సృష్టించడం ఖాయం. ఈ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట కొత్త రూల్స్ గురించి, 2024 బాలాపూర్ గణేష్ విగ్రహ ప్రత్యేకత గురించి క్లియర్ గా ఈ వ్లాగ్ లో తెలియజేశాము. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరుకు చూడండి.
Watch Vinayaka Chavithi 2024 Special Balapur Ganesh Laddu Vlog
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధు మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని పుణ్యక్షేత్రాల వీడియోల కోసం మా భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ను టాప్ చేయండి. అలాగే భక్తివిశేషాల కోసం మా వెబ్సైటును ఫాలో అవ్వండి.
మరికొన్ని వ్లాగ్స్ లింక్స్….
1. Watch Harasiddhi Matha & Gad Kalika Mata Ujjain Shakthi Peeth Temples Vlog