తులసి మొక్కను ఏ ఏ సందర్భాల్లో ముట్టకూడదు?

హిందూ మతంలో తులసి మొక్క చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని భావన కాబట్టి అత్యంత పవిత్రంగా చూస్తారు. దాదాపుగా అందరి ఇళ్లలోనూ తులసి మొక్కలుంటాయి. నిత్యం ఉదయాన్నే తులసి మొక్కను పూజించుకున్న తరువాతనే ఇతర పనుల్లోకి వెళుతుంటారు. తులసి దళాలను (తులసి ఆకులు) కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో, పండగల్లో, పూజలు, ఉపవాసం మొదలైన సందర్భాల్లో ఉపయోగిస్తారు. విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన పూజలో తులసి తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి తులసి మొక్కను కొన్ని సందర్భాల్లో తాకకూడదని అంటారు. అవేంటో తెలుసుకుందాం.

హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఆదివారం, ఏకాదశి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో తులసి మొక్కను తాకకూడదు. ఆదివారం ఎందుకు తాకకూడదంటే.. ఈ రోజున విష్ణుమూర్తి కోసం లక్ష్మీదేవి ఉపవాసం ఉంటుందట. కాబట్టి ఆ రోజున తాకకూడదట. ఏకాదశి నాడు తులసి మొక్క విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉపవాసాన్ని ఆచరిస్తుందట. కాబట్టి ఆ రోజున తులసి తాకకూడదట. రాత్రి వేళ తులసిని తాకితే ఆర్థిక నష్టం సంభవిస్తుందట. ఏకాదశి, ఆదివారం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, రాత్రి సమయాల్లో తులసి దళాలను కోయవద్దట. స్నానం చేయకుండా, అలాగే స్త్రీలు పిరియడ్స్ సమయంలోనూ తులసి మొక్కను తాకకూడదు.

Share this post with your friends