భక్తుల సౌకర్యార్థం తిరుమలలో వైట్ కూల్ పెయింట్ వేసిన అధికారులు

టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు ఆదేశాల మేరకు భ‌క్తులు ఎండ‌కు ఇబ్బందులు ప‌డ‌కుండా మంగళవారం ఇంజనీరింగ్ అధికారులు కూల్ పెయింట్ వేశారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో సోమవారం జరిగిన ఇంజినీరింగ్‌ విభాగం అధికారుల సమీక్షా సమావేశంలో భక్తుల సౌకర్యాల దృష్ట్యా వైట్‌ కూలెంట్‌ పెయింటింగ్‌ పనులు వెంటనే చేపట్టాలని ఈఓ అధికారులను ఆదేశించారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు శ్రీవారి ఆలయం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, వాహన మండపం, రాంభగీచ, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే నాలుగు మాడ వీధుల్లో వైట్ కూల్ పెయింట్ వేశారు.

Share this post with your friends