తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి వేలానికి సిద్ధమవుతోంది. భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో హుండీ ద్వారా సమర్పించిన కానుకలను ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఆగస్ట్ 1న వేలం వేయనున్నారు. ఈ వేలంలో బ్రాండెడ్ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇక కొన్ని వినియోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం 10 లాట్లు ఈ వేలం వేయనున్నారు. కొనుగోలు చేయాలనుకునే వినియోగ దారుల కోసం టీటీడీ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రకటించింది.
వివరాలకోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించాలని సూచించింది. అలాగే ఆన్‌లైన్ ద్వారా సంప్రదించాలనుకునే వారు రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించాలని టీటీడీ తెలిపింది. కాబట్టి కెమెరాలు కొనుగోలు చేయాలనుకునేవారు ఆయా నంబర్‌లో కానీ వెబ్‌సైట్ పోర్టల్‌ను కానీ సంప్రదించండి. ఇక శ్రీ మలయప్ప స్వామివారికి నిన్న కోల్‌కతాకు చెందిన మోటోవోల్ట్ సీఈవో తుషార్ చౌదరి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విరాళంగా అందజేశాడు. వీటి విలువ రూ.2.45 లక్షలని తెలుస్తోంది.