తిరుమలలో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం పరిమితం చేసింది. జూలై 22వ తేదీ నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. ఆఫ్ లైన్‌లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రోజుకు 1000కి టీటీడీ పరిమితం చేసింది. ఆన్‌లైన్‌లో 500 టికెట్లను విడుదల చేస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా, సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా జూలై 22వ తేదీ నుంచి శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు 1,000కి పరిమితం చేసింది.
ఇందులో భాగంగా ఆన్ లైన్ లో 500 (ఇదివరకు ఉన్నట్లే), ఆఫ్ లైన్‌లో మరో 1,000 టికెట్లను మాత్రమే జారీ చేస్తారు. దీనిలో తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికగా జారీ చేస్తారు. మిగిలిన 100 టికెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో మాత్రమే ఈ ఆఫ్‌లైన్ టిక్కెట్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది.