హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయను కూడా ఒక పండుగ మాదిరిగానే చూస్తారు. ముఖ్యంగా స్త్రీలకు చాలా ఇష్టమైన పండుగ. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథి నాడు అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఈ పండుగ ఈ నెల 10వ తేదీన రానుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ బంగారం కొనుగోలు చేసేందుకు మక్కువ చూపిస్తారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని ప్రతీతి. అయితే అందరికీ బంగారాన్ని కొనేంత స్తోమత ఉండదు. అసలే బంగారం ధర ఇప్పుడు ఆకాశాన్నంటుతోంది. మరి తరుణంలో ఏం చేయాలి?
ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బంగారం కొనేంత స్తోమత ఉండకపోవచ్చు. ఇలాంటి వారు బాధపడనక్కర్లేదు. అంతకు మించిన ఫలితాన్ని మరో రూపంలో పొందవచ్చు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేని వారంతా దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తెచ్చుకోండి. దానిని పూజగదిలో పెట్టి పూజించండి. అంతే ఇంట్లో లక్ష్మీదేవి తప్పక కొలువుంటుందట. అలాగే ఈ రోజున భోళాశంకరుడికి సంబంధించిన పాదరస లింగాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూజించినా బంగారం కొనుగోలు చేసిన దానికి మించిన ఫలితం వస్తుందట. అలాగే ఏకాక్షి కొబ్బరికాయను తీసుకొచ్చి లక్ష్మీదేవి రూపంగా భావించిన పూజించినా కూడా అమ్మవారి కటాక్షం మెండుగా ఉంటుందట. అలాగే కొత్త కుండను కకొగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నా ఫలితం చాలా గొప్పగా ఉంటుందట.