వినాయక చవితి పెద్దగా సమయం లేదు. సెప్టెంబర్ 7వ తేదీన వినాయకచవితిని జరుపుకోనున్నాం. గణేష్ చతుర్థి వస్తుందంటేనే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. పది రోజుల పాటు పల్లెలు, పట్టణాలన్నీ సందడిగా మారతాయి. ఇక వినాయక చవితి రోజు మరో ప్రత్యేకత ఏంటంటే.. భద్రవస్ యోగం ఏర్పడనుంది. ఇది అదృష్టాన్ని మార్చే యోగమట. ఈ సమయంలో భగవంతుడిని మనస్ఫూర్తిగా పూజిస్తే చాలా మంచి జరుగుతుందట. అంతేకాకుండా బ్రహ్మయోగం, ఇంద్ర యోగం, సిద్ధ యోగం కూడా ఈ రోజున ఏర్పడనున్నాయి. ఈ రెండు యోగాలు కూడా చాలా మంచి చేస్తామట.
మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే భద్రవస్ యోగం అంటే ఏంటో ముందు చూద్దాం. ప్రతి ఏడాది మనం వినాయక చవితి పండుగను భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి నాడు జరుపుకుంటూ ఉంటాము. ఈ రోజు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు మనకు లభిస్తాయట. ఈ సారి భద్రవస్ యోగం సెప్టెంబర్ 7వ తేదీన ఉదయం 04:20 గంటలకు ఏర్పడి.. సాయంత్రం 5:37 గంటలకు ముగుస్తుంది. భద్రుడు పాతాళంలో నివసించే కాలానే భద్రవస్ అని పిలుస్తారు. భద్రుడు పాతాళంలో ఉండడం వల్ల భూలోకంలో నివసించే వారంతా క్షేమంగా.. సుఖ సంతోషాలతో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి.