ఈ నెలలో రెండు ఏకాదశిలు.. ఎప్పుడెప్పుడంటే..

హిందూ మతంలో ఏకాదశికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. ఈ రోజున శ్రీ మహా విష్ణువును ఆరాధించుకుని ఉపవాసం చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతారు. ఈ క్రమంలోనే తప్పక ప్రతి ఒక్కరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో పాటిస్తే మనం చేసిన పాపాలన్నింటి నుంచి విముక్తి పొందుతారట. ఈ క్రమంలోనే జీవితంలో శాంతి, ఆనందం, శ్రేయస్సు పెంపొందుతాయని నమ్మకం. అయితే ఏకాదశి ఉపవాసం పాటించే వారికి సెప్టెంబర్ నెల మరింత ప్రత్యేకమైనది. ఈసారి విష్ణుమూర్తి అనుగ్రహం పొందే అవకాశం రెండు సార్లు వచ్చింది. ఎందుకంటే ఈ నెలలో రెండు ముఖ్యమైన ఏకాదశి తిధిలు వచ్చాయి.

ఈ నెలలో వచ్చే రెండు ఏకాదశిలను పరివర్తినీ ఏకాదశిగానూ.. రెండు ఇందిరా ఏకాదశిగానూ కొలుస్తాము. పరివర్తిని ఏకాదశి ఉపవాసం 14 సెప్టెంబర్ 2024 శనివారం నాడు ఆచరిస్తాం. ఉపవాసం వచ్చేసి 14న ప్రారంభించి మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 15న ఉపవాస దీక్ష విరమించాల్సి ఉంటుంది. ఇక ఇందిరా ఏకాదశిని భాద్రపద మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి నాడు జరుపుకుంటాం. ఈ ఏడాది మనం ఇందిరా ఏకాదశిని ఈ నెల 28న జరుపుకోబోతున్నాం. ఇందిరా ఏకాదశి రోజున చేసే ఉపవాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ రోజున ఉపవాసం చేస్తే.. పూర్వీకులకు శాంతికి, వారి ఆత్మల మోక్షం కలుగుతుందట.

Share this post with your friends