ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారంతా తప్పక దర్శించుకునే ఆలయమేంటంటే..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న లక్ష్మీదేవి ఆలయం గురించి ముందుగానే చెప్పుకున్నాం. అయితే ద్వాపర యుగానికి చెందినదని చెబుతారు. మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం కోసం అడవుల్లో సంచరిస్తూ ఉండేవారు. ఆ సమయంలో లక్ష్మీదేవిని పూజించడం ఎలా అని ఆలోచిస్తూ కుంతీదేవి పరధ్యానంలో ఉన్నదట. తల్లి బాధను చూసిన పాండవులు ఆమె బాధ తీర్చేందుకు ఇంద్రుడి గురించి తపస్సు చేశారట. వీరి తపస్సుకు మెచ్చిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని పంపాడట. అప్పుడు కుంతీదేవి.. లక్ష్మీదేవితో పాటు కుంతీదేవిని కూడా పూజించిందట.

కుంతీదేవి భక్తికి మెచ్చిన లక్ష్మీదేవి సంతోషించి పాండవులను ఆశీర్వదించిందట. ఆ తరువాత కాలక్రమంలో పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి పొందారట. ఇక ఆ తరువాతి కాలంలో ఇక్కడి లక్ష్మీదేవి ఆలయం మరింత ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రసాదంగా భక్తులకు నాణేలు లభిస్తాయట. దీపావళి రోజున ఇక్కడి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పెద్ద మొత్తంలో పాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే ఒకటి కాదు.. రెండు కాదు.. 56 రకాల నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. ఇక ఇక్కడ అరుదైన విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ విష్ణుమూర్తి నలుపు రంగులో దశావతార రూపంలో కనిపిస్తాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారంతా తప్పక ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.

Share this post with your friends