భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. చాలా ఆలయాలకు విశిష్ట రహస్యాలు నెలకొని ఉంటాయి. ఈ ఆలయాలు శతాబ్దాలుగా వాటికి రహస్యాలు కోల్పోకుండా అలాగే కొనసాగుతున్నాయి. అచ్చం అలాంటి విశిష్టత కలిగిన ఓ శివాలయం రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్‌పూర్‌లోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉంది. ఇక ఈ గుడిలోని మిస్టరీ వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ దేవాలయం భారతదేశంలో ఉన్న శివాలయాల్లో మిస్టరీ ఆలయంగా మిగిలిపోతుంది. ఈ ఆలయం సైన్సుకు సవాల్ గా మారింది. మిస్టరీ గురించి పూర్తి వివరాలు చూస్తే..
ఈ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం ప్రతిరోజు మూడుసార్లు రంగులను మారుస్తుంది. ఇందులో భాగంగా ఉదయం పూట ఎర్రగా, అలాగే మధ్యాహ్నం పూట కాషాయం రంగులోకి, అలాగే సాయంత్రం పూట చామన చాయ (నీలం) రంగులో శివలింగం కనబడుతుంది. ఇక్కడ శివలింగం సాలగ్రామ రూపంలో కనబడుతుంది. ఆయన గాని 3 వేళల్లో మూడు రంగుల్లో శివలింగం దర్శనమిస్తుంది.
ఇకపోతే ఈ మిస్టరీని ఇప్పటివరకు ఏ శాస్త్రవేత్త కూడా నిరూపించలేకపోయారు. ఇలాంటి అద్భుతమైన దృశ్యాన్ని చూడాలని భారీ సంఖ్యలో భక్తులు ఆలయనే సందర్శించడానికి చేరుకుంటారు. ఉదయం పూట వచ్చిన భక్తులు సాయంత్రం వరకు ఉండి శివలింగం రంగులు మారడాన్ని చూస్తారు. అయితే ఇలా పూటకు ఒక రంగును మార్చుకోవడం వెనక ఉన్న కారణానికి అనేక పరిశోధనలు జరిగాయి. ఇందులో కొందరు శివలింగం మీద సూర్య కాంతి పడడం ద్వారా ఇలా జరుగుతుందని తేల్చారు. ఈ ఆలయం 2500 సంవత్సరాల క్రితం కిందదని అక్కడి స్థానికులు చెబుతారు. ఈ ఆలయంలో పంచలోహాలతో తయారుచేసిన నంది విగ్రహం ప్రధాన ఆకర్షణగా కూడా నిలుస్తుంది.