పూర్వకాలంలోనే కాదు.. ఇప్పటికీ వర్షాల కోసం యాగాలు చేస్తూనే ఉండటం చూస్తుంటాం. అయితే పూర్వ కాలంలో ఇది మరీ ఎక్కువ. అతి వృష్టి అయినా కష్టమే.. అనావృష్టి అయినా కూడా కష్టమే కాబట్టి ఈ రెండింటిలో ఏ సమస్య ఉన్నా కూడా యాగం చేసేవారు. ఈ ఏడాది సరైన వర్షాలు ఇంతవరకూ ప్రారంభం కాలేదు. వర్షాల కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో అనావృష్టి తొలగాలని కొన్ని రోజులుగా శ్రీ ఋష్య శృంగిని మంత్ర పఠనం జరుపుతున్నారు. పాత శివాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
మంత్ర పఠన తర్వాత సాక్షాత్శ్రీ ఋష్య శృంగిని ప్రతిరూపమైన శివుడికి జలాభిషేకం చేసి భారతదేశంలో సకాలంలో వర్షాలు పడాలని భక్తులు, మహిళలు కోరుకుంటున్నారు. ఈ ఈ పూజ, అభిషేకం కారణంగా వర్షాలు పడతాయని.. ప్రజలు సుఖశాంతులతో ఉంటారని నమ్మకం. అలాగే అనావృష్టి తొలగిపోయి సమృద్ధి వర్షాలు కురుస్తాయని ఆలయ పూజారులు చెబుతున్నారు. రైతులు కూడా ఈ మంత్ర పఠనంతో అయినా భగవంతుని కృపాకటాక్షాలతో వర్షాలు పడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకు జలాభిషేకం చేసి వర్షాలు సమృద్ధిగా కకురవాలని కోరుతున్నారు.