Pathinettampadi : ఇరుముడి ఉంటేనే ఆ మెట్లు ఎక్కేందుకు అర్హత… కారణమేంటో తెలుసా?

ఇరుముడి ఉంటేనే శబరిమలలోని పదునెట్టాంబడిని ఎక్కే అర్హత కలుగుతుంది… ఇది కేవలం నియమం కాదు, ఆధ్యాత్మిక రహస్యం. మండల దీక్షతో శరీరం, మనస్సు, ఆత్మను శుద్ధి చేసుకున్న భక్తుడు మాత్రమే ఇరుముడితో ఆ పవిత్ర మెట్లను అధిరోహించాలి. పదునెట్టాంబడి ప్రతి మెట్టు ఒక గుణత్యాగానికి, ఒక దైవశక్తికి ప్రతీకగా భావిస్తారు. అరిషడ్వార్గాల నివృత్తి, ఇంద్రియ నిగ్రహం, శరణాగతి భావమే ఈ మెట్ల అంతరార్థం. అయ్యప్ప స్వామి తన అస్త్రశక్తిని ఈ మెట్లలో నిక్షిప్తం చేశాడని పురాణ విశ్వాసం. అందుకే ఇరుముడి లేకుండా ఆ మెట్లపై అడుగు పెట్టరాదు. భక్తి, దీక్ష, విశ్వాసంతో అడుగులు వేస్తే స్వామి సన్నిధానం మోక్ష ద్వారంగా మారుతుంది. స్వామియే శరణమయ్యప్ప!

Pathinettampadi - The Eighteen Steps of Sabarimala
Pathinettampadi – The Eighteen Steps of Sabarimala
Share this post with your friends