మరోసారి పూరి జగన్నాథుని ఆలయంలోని రత్న భాండాగారాన్ని తెరిచిన అధికారులు

ఒడిశాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పూరీ జగన్నాథుడి ఆలయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మూడవ రహస్య గది ఉందని.. దానిని చేరుకోవాలంటే సొరంగ మార్గం ద్వారా వెళ్లాలంటూ ప్రచారం జరగడంతో తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే రత్న భండార్‌ని ఆదివారం తెరిచిన విషయం విదితమే. ఇక నేడు దానిని అధికారులు మరోసారి తెరిచి విలువైన వస్తువులన్నింటినీ స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తున్నారు. ఆదివారం కొంత మేర విలువైన వస్తువులను తరలించారు. ఇవాళ మిగిలినవన్నీ తరలిస్తున్నారు. ఉదయం 9:51 గంటలకు పర్యవేక్షక కమిటీ సభ్యులు గుడిలోకి వెళ్లారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ ప్రక్రియను ప్రారంరభించారు.

ఉదయం 9 గంటలకు పర్యవేక్షక కమిటీ చైర్మన్ తదితరులు ఆలయంలోకి ప్రవేశించి పునరావాస ప్రక్రియను ప్రారంభించారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు పర్యవేక్షక కమిటీ చైర్మన్, ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ మీడియాతో మాట్లాడుతూ.. రత్నభాండార్ లోపలి గదిలో భద్రపరిచిన విలువైన వస్తువులన్నింటినీ తిరిగి తీసుకురావడానికి ముందుగా జగన్నాథుడి ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. ఆదివారం ఆలస్యం కావడంతో రహస్య గదికి సీల్ వేశారు. నేడు తెరిచి విలువైన వస్తువులను తరలిస్తున్నారు. ఈ ప్రక్రియలో అంతా సంప్రదాయ దుస్తులనే ధరించారు. ఈ ప్రక్రియను మొత్తాన్ని వీడియో తీస్తున్నారు.

Share this post with your friends