దీపావళి ఏ రోజున రానుంది? పూజకు అనుకూల సమయం ఏంటి?

హిందువుల ప్రధాన పండుగల్లో దీపావళి కూడా నరకాసురుడు అనే రాక్షసుడి వధను ప్రజలంతా ఆనందంగా జరుపుకునే పండుగే దీపావళి. ఈ పండుగ ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలోని అమావాస్య తిథినాడు జరుపుకుంటూ ఉంటాం. దీపావళి పండుగ నాడు గణేశుడు, సరస్వతి దేవి, కుబేరుడితో పాటు లక్ష్మీ దేవిని నియమ నిష్టలతో పూజిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుందని భక్తుల నమ్మకం. అయితే ఇటీవలి కాలంలో ప్రతి పండుగ విషయంలోనూ గందరగోళం నెలకొంటోంది. దీపావళి పండుగ విషయంలోనూ అదే జరిగింది.

దీపావళి అమావాస్య అక్టోబర్‌ 31న వచ్చిందా లేదా 1 నవంబర్ తేదీన వచ్చిందా అనే విషయంలో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. వాస్తవానికి ఆశ్వయుజ మాసంలోని అమావాస్య తిథి అక్టోబర్ 31 మధ్యాహ్నం 3:52 గంటలకు ప్రారంభమై నవంబర్ 1 సాయంత్రం 6:18 గంటలకు ముగుస్తుంది. కాబట్టి నరక చతుర్ధశిని అక్టోబర్ 31న, దీపావళి అంటే లక్ష్మీపూజను నవంబర్ 1న, గోవర్థన పూజను నవంబర్ 2న జరుపుకుంటాం. ఇక లక్ష్మీదేవిని పూజించేందుకు అనుకూలమైన సమయం ఎప్పుడంటే.. నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5:36 నుంచి 6:16 వరకు అనుకూలమైన సమయంగా పేర్కొంటారు.

Share this post with your friends