హైదరాబాద్: రంగం కార్యక్రమం నేడు వైభవంగా జరిగింది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల నేపథ్యంలో రెండవ రోజున రంగం కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి పలికింది. ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపింది. ఈ ఏడాది పూజలు సంతోషంగా ఆనందంగా అందుకున్నానని… ఎవరికీ ఏ ఆటంకమూ లేకుండా చూసుకున్నానని తెలిపింది. ఏ బోనం అయినా, ఎవరు ఎతుకొచ్చినా పర్వాలేదని.. సంతోషంగా అందుకుంది తానేనని అమ్మ తెలిపింది. వాళ్లూ.. వీళ్లూ తేవాలని సందేహం పెట్టుకోవద్దని సూచించింది. ఎవరు తెచ్చినా సంతోషంగా అందుకునే బాధ్యత తనదని భవిష్యవాణి తెలిపింది.
Rangam Bhavishyavani 2024 Full Video : రంగం భవిష్యవాణి 2024 | Secunderabad Ujjaini Mahankali Bonalu
ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని.. మంచిగా చూసుకుంటానని అమ్మ తెలిపింది. ఎటువంటి లోటూ మీకు జరగనివ్వనని.. మీరు ఆనందంగా, సంతోషంగా ఉండాలని సూచించింది. అనుమానాలు పెట్టుకోవద్దని.. తనను నమ్మకున్న వారిని కాపాడుకుంటానని వెల్లడించింది. పిల్లలు, పెద్దలు, జంతువులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటానని తెలిపింది. ‘ఇంకా ఏమైనా చేయాల్సి ఉందా? ఏం కోరకుంటున్నావ్?’ అని అడగ్గా తన రూపం పెట్టాలి అనుకుంటున్నారు కదా .. పెట్టాలని సూచించింది. ఎవరు ఏం చేసినా,. ఎవరెంత అడ్డుపడిన తన రూపం నేను పెట్టించుకుంటానని.. తప్పని సరిగా తన రూపాన్ని నేను నిలబెట్టుకుంటానని తెలిపింది. తనకు రక్త పాశం ఇవ్వడం లేదని.. మీకు నచ్చింది ఇస్తున్నారని.. దానితోనే సంతోష పడుతున్నానని తెలిపింది. పిల్లలకు, గర్భిణులకు ఏం ఇబ్బంది రానివ్వనని… అందరూ సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాని భవిష్యవాణి తెలిపింది.