పూరీ శ్రీక్షేత్రంలో ఒకే రోజున నవ యవ్వన రూపం, నేత్రోత్సవం, రథయాత్ర

గోపాలపూర్‌ (ఒడిశా) : జులై 7వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు పురుషోత్తమునికి నవయవ్వన అవతార అలంకరణ, ఉదయం 7.30 గంటలకు రత్నసింహాసనంపై నేత్రోత్సవం, ఉదయం 11 గంటలకు రథాల ప్రతిష్ట, మధ్యాహ్నం 1.10 గంటల నుండి 2.30 గంటల వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల పొహండి, సాయంత్రం 4 గంటలకు చెరాపహారా చేయనున్న పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌, సాయంత్రం 5 గంటలకు రథయాత్ర ప్రారంభం, 8వ తేదీన గుండిచా మందిరానికి చేరుకోనున్న రథాలు, 9న గుండిచా పొహండి.

జులై 15న బహుడా (తిరుగు) యాత్ర, 17న హరిశయన ఏకాదశిని పురస్కరించుకొని శ్రీక్షేత్రం వెలుపల రథాలపై పురుషోత్తమ, బలభద్ర, సుభద్రల స్వర్ణాభరణధారణ (సున్నాభెషో) వేడుక, 18న అధరపొణా ఉత్సవం, 19న నీలాద్రిబిజె వేడుక.

పూరీ శ్రీక్షేత్రంలోని చీకటి మందిరంలో చతుర్థామూర్తులకు కొనసాగుతున్న గోప్య సేవలు. “పుల్లెరి తెల్లో” లేపనం తరువాత స్వల్పంగా కోలుకున్న జగన్నాథుడు.

ఈ ఏడాది ఒకే రోజున నవయవ్వనరూపం, నేత్రోత్సవం, రథయాత్ర. తిథి, వార, లగ్న నక్షత్రాల ఆధారంగా సేవాయత్‌ల నిర్ణయం. 53 ఏళ్ల తరువాత పునరావృత్తం.

Share this post with your friends