శివుడిని సూర్యాస్తమయం వరకూ పట్టి ఉంటానన్న శనిదేవుడు.. తర్వాతేం జరిగిందంటే..

అసలు శివుడికి, బిల్వ పత్రానికి ఉన్న సంబంధం గురించి చెప్పే పురాణ గాథ ఒకటుంది. దాని గురించి తెలుసుకుందాం. ఒకసారి శనిదేవుడు శివ సందర్శన కోసం కైలాసానికి వెళ్లాడట. అక్కడ పార్వతీ పరమేశ్వరులను భక్తితో స్తుతించగా.. శంకరుడు ఆనందించి శని దేవుని విధిని, ధర్మాన్నిపరీక్షించాలనుకున్నాడట. “లోకాలను పట్టి పీడించే నువ్వు నన్ను పట్టగలవా?” అని ప్రశ్నించాడట. అప్పుడు శని దేవుడు వినయంతో “తమ అనుగ్రహం ఉన్నంత వరకు తనకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పాడట. అలాగే తమరిని కూడా పట్టగలనని చెప్పి టైం కూడా చెప్పాడట.

రేపటి రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మిమ్మల్ని పట్టి ఉండగలననిని శివుడితో శని చెప్పాడట. శని కర్తవ్య దీక్షను పరీక్షించడానికి శివుడు ఆ మర్నాడు ఉషోదయ కాలానికి ముందే శని నుంచి తప్పించుకోవడానికి శివుడు బిల్వ వృక్షంలో దాక్కొన్నాడట. మహేశ్వరుని జాడ తెలియక ఇటు పార్వతీదేవితో పాటు, దేవాది దేవతలంతా ముల్లోకాలను గాలించారట. అయితే వారికి శని దేవుడు కనిపించక పోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సంధ్యా సమయానికి శివుడు బిల్వ వృక్షం నుంచి సాకార రూపంగా ప్రత్యక్షమవగా… ఆ మరుక్షణమే శని కూడా బిల్వ వృక్షం నుంచే ప్రత్యక్షమయ్యాడు.

Share this post with your friends